

యంగ్ సెన్సేషన్ తిరు వీర్ మరియు ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలిసి నటిస్తున్న గ్రామీణ నేపథ్య రొమాంటిక్ కామెడీ చిత్రం ఓహ్..! సుకుమారి. ఈ సినిమాతో భరత్ ధర్షన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాజేష్‌ను దామిని పాత్రలో పరిచయం చేసిన మేకర్స్, తాజాగా తిరు వీర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్‌లో తిరు వీర్ ‘యాదగిరి’ అనే గ్రామీణ యువకుడిగా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. స్లీవ్‌లెస్ బనియన్, ముడిచిన లుంగీ, భుజాలపై తువ్వాలు, నోట్లో బ్రష్‌తో ఆయన లుక్ పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఆయన నడక, హావభావాలు పాత్రకు ప్రత్యేకమైన యాటిట్యూడ్‌ను తీసుకొచ్చాయి. సీహెచ్ కుషేందర్ సినిమాటోగ్రఫీ, భరత్ మాంచిరాజు సంగీతం, తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్షన్, శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ ఈ చిత్రానికి బలంగా నిలవనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!