
జనరల్

ది ప్యారడైజ్ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీ షూట్ చేయలేదని స్పష్టం చేసింది. హీరో నాని కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ను రీ షూట్ కోరినట్లు వచ్చిన వార్తలను టీం ఖండించింది.
‘ది ప్యారడైజ్’ సినిమా మొదటి రోజు నుంచే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే 100 రోజులకుపైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా కొనసాగుతుందని పేర్కొంది. భవిష్యత్తులో కూడా రీ షూట్ అవసరం ఉండదని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, సినిమా ఆగస్టు 21న ప్రణాళిక ప్రకారమే విడుదల అవుతుందని వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!