

బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన కెరీర్ తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో కొత్తవారికి ఉన్న అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బట్వారా 1947’, ‘వైబ్’ చిత్రాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నటీనటులుగా రాణించాలంటే చిత్ర పరిశ్రమలో ఎవరో ఒకరు పరిచయం ఉండటం అవసరమని, ప్రస్తుతం సాంకేతికత, ఆడిషన్లు, కాస్టింగ్ డైరెక్టర్ల కారణంగా కొత్తవారికి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
తాను కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో కాస్టింగ్ డైరెక్టర్లు వంటి వ్యవస్థలు లేవని, సొంతంగా అవకాశాలు వెతుక్కుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని ప్రీతి జింటా చెప్పారు. అయితే కెరీర్ ప్రారంభంలో బాబీ డియోల్ సహా పరిశ్రమలో, బయట తనకు అండగా నిలిచిన పలువురు ఉన్నారని, వారి సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరని చెప్పిన ఆమె.. తన తొలి చిత్రం ‘దిల్ సే’ సమయంలో మనీషా కొయిరాలా, షారుక్ ఖాన్ నుంచి ఎంతో నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!