

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆయన ఓటీటీ అరంగేట్రం కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ అనే టాక్ షోతో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. దీంతో చిరంజీవిని కొత్త ఫార్మాట్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘మెగావర్స్’ ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తొలుత తొలి ఎపిసోడ్ దీపావళి కానుకగా విడుదల కావచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజాగా షో విడుదల షెడ్యూల్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారాంతంలో ‘మెగావర్స్’ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ లేదా షో నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!