
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖపై చర్యల అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో, ఆయన రాక తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి చేరుకున్న అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై పార్టీ అధిష్ఠానం చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొండా సురేఖపై తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!