

‘నెల టికెట్’, ‘రెడ్’, ‘హరోమ్ హరా’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ ఇప్పుడు మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖలీఫా’ చిత్రంతో ఆమె మాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కేరళలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి సినిమాకు సంబంధం లేని వ్యక్తిగత ప్రశ్న అడగడంతో మాళవిక శర్మ అసహనానికి గురయ్యారు. కేరళకు వచ్చిన తర్వాత బీఫ్ తిన్నారా, నచ్చిందా అని అడగగా.. తాను పూర్తిగా శాకాహారినని, అలాంటి ఆహారాన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది. సినిమాకు సంబంధించిన విషయాలు, నటన గురించి ప్రశ్నించకుండా వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై ప్రశ్నించడం సరికాదంటూ కొందరు నెటిజన్లు విలేకరిపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రమోషన్ల సమయంలో ఇలాంటి ప్రశ్నలు సాధారణమేనని అంటున్నారు. గతంలో నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ప్రమోషన్ సమయంలో తన దుస్తులపై అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. దీంతో కేరళలో సినిమా ప్రమోషన్ల సందర్భంగా విలేకరులు అడిగే ప్రశ్నలపై, సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులపై మరోసారి చర్చ మొదలైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!