
సినిమాలు

నందమూరి బాలకృష్ణ 111వ సినిమాపై తాజాగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముందుగా మరో హీరోయిన్ పేరు వినిపించినప్పటికీ చివరకు కాజల్‌కే అవకాశం దక్కినట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై వేగంగా కొనసాగుతోంది.
ఈ చిత్రానికి కాజల్ ప్రత్యేకంగా తేదీలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఆమె షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బాలయ్యతో కలిసి నటించిన చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ జోడీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!