
జనరల్

ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకెళ్లిన రవితేజ, గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సంక్రాంతికి వచ్చిన సినిమా కంటెంట్ పరంగా బాగున్నా వసూళ్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై ఆసక్తి పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం, ‘రాజరాజచోర’తో గుర్తింపు పొందిన హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా చేసే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు “అక్కాయిలు బాగున్నారా?” అనే విచిత్రమైన టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!