
జనరల్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా టాలీవుడ్ నిర్మాతలతో భారీ పాన్ ఇండియా చిత్రాలకు సిద్ధమవుతున్నారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి ఇప్పటికే రెగ్యులర్ చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సినిమాను ఈద్ 2027 సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక మరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా సల్మాన్ ఖాన్ సూపర్ హీరో చిత్రంలో భాగస్వామ్యం కావడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అతుల్ అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సమంత హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!