

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ వరుస సినిమాల విడుదలలతో బాక్సాఫీస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో విజయాన్ని అందుకున్న ఆయన నిర్మాణంలో వచ్చిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా అక్టోబర్ 9న వెంకటేశ్–త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు అక్టోబర్ 15న విడుదల కానున్న రజనీకాంత్ ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను కూడా నాగవంశీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఆ వారం బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల కేటాయింపుపై నాగవంశీ ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’, ‘జైలర్ 2’ రెండూ మంచి వసూళ్లు సాధిస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఈ సీజన్ కీలకంగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!