

తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం ‘గీతాంజలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున, గిరిజ జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 13న రీరిలీజ్ కానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ‘‘మరోసారి ఆ మేజిక్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. నాగార్జున కెరీర్లో ఈ సినిమా చిరస్మరణీయ విజయంగా నిలిచింది.
‘గీతాంజలి’లో మరణానికి చేరువలో ఉన్న ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే అనుబంధాన్ని మణిరత్నం ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంతో గిరిజ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలు సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం పాత చిత్రాల రీరిలీజ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘గీతాంజలి’ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!