

టాలీవుడ్‌లో మరోసారి విప్లవ గీతాల సందడి మొదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా 'మైసా' నుంచి తాజాగా విడుదలైన 'ఓసేయ్ రాములమ్మ' పాట సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాటకు దాదాపు 29 ఏళ్ల తర్వాత ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కలిసి పనిచేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటలో విప్లవ స్ఫూర్తి, ఆవేశం, ధైర్యం, పోరాట పటిమ ప్రతిధ్వనిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు సముద్రఖని, ఈశ్వరి రావు, రావు రమేష్, గురు సోమసుందరం, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోండు గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా 'మైసా' తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక గత చిత్రాలకు భిన్నంగా గోండు మహిళ పాత్రలో కనిపించనున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, భావోద్వేగాలు, పోరాటం, ప్రతీకారం వంటి అంశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!