
సినిమాలు

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కథానాయికలు రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. హోమి అదజానియా దర్శకత్వంలో దినేశ్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘తుజ్కో’ అనే కొత్త గీతాన్ని విడుదల చేసింది.
ఈ పాటలో షాహిద్–రష్మికల కాలేజీ ప్రేమ ప్రయాణం అందంగా చూపించబడింది. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, కృతి సనన్ ఎంట్రీతో కథ మరింత భావోద్వేగంగా మారింది. అర్జిత్ సింగ్, సునిధి చౌహాన్ ఆలపించిన ఈ గీతానికి అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. ప్రేమ భావాలను అందంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!