
బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్లు ఆసక్తిని పెంచుతున్నాయి. నటుడు మురళీ శర్మ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనను అధికారికంగా సినిమాలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఆయన పోషిస్తున్న పాత్ర వివరాలను మాత్రం మేకర్స్ గోప్యంగా ఉంచారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే మరిన్ని కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు సినిమాకు సంబంధించిన ఇతర అప్‌డేట్లను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!