15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

Writer: Chandrika 05:37 AM, 15 నవంబర్, 2026
తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలలు కలిపి మొత్తం 242 విద్యాసంస్థల్లో 2,00,257 సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే అన్ని కేటగిరీల్లో కలిపి 1,24,851 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 62.34 శాతం ప్రవేశాలే నమోదయ్యాయి. ప్రభుత్వం భర్తీ చేసే కన్వీనర్ కోటాలో 1,52,731 సీట్లకు గాను 98,406 సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన 49,344 సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునేందుకు ప్రైవేట్ కళాశాలలకు అవకాశం కల్పించినా.. కేవలం 1,498 సీట్లే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లోనూ 2,446 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ సీట్లను స్పాట్ కోటా ద్వారా భర్తీ చేసేందుకు కొన్ని విశ్వవిద్యాలయాలు అనుమతి కోరుతున్నప్పటికీ.. సాంకేతిక విద్య నాణ్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగీకరించడం లేదు. సాధారణ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గడంతో పలు విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించాయి. అయితే చాలా చోట్ల రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన కొనసాగించడం విద్యార్థుల ఆసక్తిని తగ్గిస్తున్నాయి.

మరోవైపు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ.. అందుకు తగినంత మంది విద్యార్థులు లేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయి. TG EAPCET ఇంజినీరింగ్ విభాగంలో సుమారు 1.82 లక్షల మంది అర్హత సాధించగా.. కౌన్సెలింగ్ కోసం 1.13 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో 1.12 లక్షల మంది మాత్రమే వెబ్ ఆప్షన్ల నమోదుకు అర్హత పొందారు. కన్వీనర్ కోటాలోనే 1.52 లక్షలకు పైగా సీట్లు ఉండగా.. యాజమాన్య కోటా సీట్లు అదనం. దీంతో ప్రైవేట్ కళాశాలల్లోనే 70 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో సాఫ్ట్‌వేర్ సంబంధిత కోర్సుల వాటా 68.53 శాతంగా ఉంది. ఈ విభాగంలో 1,37,254 సీట్లు అందుబాటులో ఉండగా.. 85,275 మాత్రమే భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 59,630 సీట్లకు 33,552, సివిల్‌లో 7,634 సీట్లకు 4,142, మెకానికల్‌లో 9,648 సీట్లకు 5,713 మాత్రమే నిండాయి. ఈ ఏడాది కొన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త కోర్సులను కూడా ప్రారంభించాయి. అయినప్పటికీ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కోర్సుల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. సివిల్, మెకానికల్ వంటి సంప్రదాయ కోర్ బ్రాంచీల్లో ఉద్యోగావకాశాలపై ఆందోళనతో ప్రవేశాలు తగ్గుతుండటంతో విద్యాసంస్థలు ఆయా కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి మరో తుపాను ముప్పు..

ఏపీకి మరో తుపాను ముప్పు..

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

మదురై తనిష్క్‌ షోరూమ్‌ చోరీ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌

మదురై తనిష్క్‌ షోరూమ్‌ చోరీ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌

భారత్‌-చైనా సరిహద్దులో సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నాం: జైశంకర్‌

భారత్‌-చైనా సరిహద్దులో సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నాం: జైశంకర్‌

ట్యాగ్లు
తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలలుఇంజినీరింగ్ సీట్లుఖాళీగా ఉన్న సీట్లుTG EAPCET 2026ఇంజినీరింగ్ ప్రవేశాలుప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలుకన్వీనర్ కోటాసాఫ్ట్‌వేర్ కోర్సులుకంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్సివిల్ మెకానికల్ ఇంజినీరింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..
జనరల్

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..
జనరల్

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..
బిజినెస్

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు
ఆరోగ్యం

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..
బిజినెస్

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..

ఏపీకి మరో తుపాను ముప్పు..
జనరల్

ఏపీకి మరో తుపాను ముప్పు..

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!
జనరల్

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!
జనరల్

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?
జనరల్

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!
జనరల్

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 69: త్రిగుణ్‌ నరేశ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో అమన్‌ నిరాశ.. బిగ్‌ జీరోగా వర్షిణి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 69: త్రిగుణ్‌ నరేశ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో అమన్‌ నిరాశ.. బిగ్‌ జీరోగా వర్షిణి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!