
సినిమాలు

ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేదవ్యాస్’ చిత్రంలో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీమోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మురళీమోహన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హైందవ ధర్మ విశిష్టతను ప్రతిబింబించే ప్రత్యేకమైన, సందేశాత్మక పాత్రలో మురళీమోహన్ కనిపించనున్నట్లు నిర్మాత తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా, ఆయన పుట్టినరోజుతో పాటు ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం మరింత ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!