
రాజకీయాలు

దేశ రాజధాని ప్రాంతంలో నదీ పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది. యమునా నదిలో క్రూజ్ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే నదుల్లోనూ పర్యాటకులకు క్రూజ్ ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
ఇటీవల యమునా నదిలో క్రూజ్ బోట్లకు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో అధికారికంగా సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదీ మార్గాల ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించడం, జలరవాణాను ప్రోత్సహించడం ఈ సేవల ప్రధాన లక్ష్యాలుగా భావిస్తున్నారు. క్రూజ్ సేవలు ప్రారంభమైతే యమునా నదీ పర్యాటకానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!