10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు

Writer: Chandrika 10:07 AM, 10 నవంబర్, 2026
కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పందిల్ల సమీపంలో సోమవారం మధ్యాహ్నం కారు, ట్రాక్టర్‌ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి చెందారు. మరోవైపు తల్లీకుమారులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్‌ (35) హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. ఇటీవల స్వగ్రామంలో మరణించిన దగ్గరి బంధువు దశదిన కర్మకు హాజరయ్యేందుకు భార్య స్వాతి, కుమార్తె మహన్వి (9), కుమారుడు శ్రీహాన్‌ (6)తో కలిసి కారులో బయలుదేరారు. పందిల్ల దాటిన తర్వాత ఓ రైస్‌మిల్లులో ధాన్యం దించి వస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న నలుగురినీ బయటకు తీశారు. అప్పటికే శ్రీకాంత్‌, మహన్వి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన స్వాతి, శ్రీహాన్‌ను 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ మ్యాక గణేశ్‌ కూడా తీవ్రంగా గాయపడటంతో హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదం శ్రీకాంత్‌ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన తల్లి సుగుణవ్వ, కొండాపూర్‌ వార్డు సభ్యురాలిగా పనిచేశారు. ఆర్నెల్ల కిందట కాశీయాత్రకు వెళ్లిన ఆమె.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక అక్కడే మృతి చెందారు. ఇప్పుడు శ్రీకాంత్‌, ఆయన కుమార్తె కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీకాంత్‌, స్వాతిది ప్రేమ వివాహం కాగా, ఇటీవల వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దశదిన కర్మకు హాజరైన తర్వాత ఇంటి సర్వే కోసం ఫొటో దిగాలని భావించినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను చూసేందుకు హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో బంధువులు చేరుకున్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. గాయపడిన స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాంత్‌ సోదరుడు సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..

యమునా నదిలో నేటి నుంచి క్రూజ్ సేవలు

యమునా నదిలో నేటి నుంచి క్రూజ్ సేవలు

అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు  లంచం..

అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు లంచం..

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు

ప్రజాకవి అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాకవి అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
సిద్దిపేట రోడ్డు ప్రమాదంహుస్నాబాద్‌ ప్రమాదంకారు ట్రాక్టర్‌ ఢీతండ్రీకూతుళ్లు మృతితెలంగాణ రోడ్డు ప్రమాదాలుపందిల్లపైడిపల్లి శ్రీకాంత్‌మహన్విపొన్నం ప్రభాకర్‌రోడ్డు భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో 76 జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ విజయం..
రాజకీయాలు

ఏపీలో 76 జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ విజయం..

2027లో చిరంజీవి నుంచి రెండు సినిమాలు?
గాసిప్స్

2027లో చిరంజీవి నుంచి రెండు సినిమాలు?

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోనియా గాంధీ వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ అభ్యంతరం
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ అభ్యంతరం

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..
జనరల్

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..

టెస్ట్ కెప్టెన్‌గా కూడా స్మృతి మంధాన
క్రీడలు

టెస్ట్ కెప్టెన్‌గా కూడా స్మృతి మంధాన

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు
జనరల్

కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు

పీట్ హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు
రాజకీయాలు

పీట్ హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు

యమునా నదిలో నేటి నుంచి క్రూజ్ సేవలు
జనరల్

యమునా నదిలో నేటి నుంచి క్రూజ్ సేవలు

అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు  లంచం..
జనరల్

అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు లంచం..

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు
రాజకీయాలు

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!