

ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో సక్సెస్ ఫార్ములాగా నిలిచిన మల్టీ హీరోయిన్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. కథ ప్రాధాన్యం, బడ్జెట్ పరిమితుల కారణంగా కొంతకాలంగా ఒక్క హీరోయిన్‌తోనే సినిమాలు రూపొందించిన దర్శకులు, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న 'జననాయగన్'లో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి నటిస్తుండగా, చిరంజీవి 'విశ్వంభర'లో త్రిష, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేక గీతంలో మౌనీ రాయ్ సందడి చేయనున్నారు.
అల్లు అర్జున్ 'రాకా'లో దీపికా పదుకొణె, ఫెమినా జార్జ్ నటిస్తుండగా, యశ్ 'టాక్సిక్'లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి వంటి ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47'లో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ నటిస్తుండగా, శర్వానంద్ 'భోగి'లో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి జోడీ కట్టనున్నారు. అలాగే కార్తి 'సర్దార్ 2'లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో మల్టీ హీరోయిన్ కాన్సెప్ట్ మరోసారి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!