

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకధీరుడిగా గుర్తింపు పొందిన ఎస్.ఎస్. రాజమౌళి సెట్స్‌లో ఎంతో క్రమశిక్షణగా, గంభీరంగా కనిపిస్తుంటారు. అయితే, ఆయన భార్య రమా రాజమౌళితో కలిసి ఓ కార్యక్రమంలో పంచుకున్న సరదా క్షణం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళిని వేదికపైకి పిలవగా, ఆయన వెనుకే ఉన్న రమా సరదాగా చేత్తో ముందుకు నెట్టారు. త్వరగా వేదికపైకి వెళ్లాలన్నట్లుగా ఆమె చేసిన ఈ చిన్న సరదా పని అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి కుటుంబసభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రమా రాజమౌళి చేసిన సరదా సంజ్ఞకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమాల విషయంలో రాజమౌళి ఎంత గంభీరంగా ఉన్నా కుటుంబంలో మాత్రం రమాతో సరదాగా ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్న ఘటన దంపతుల మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధాన్ని ప్రతిబింబిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!