
జనరల్

టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర రూపకల్పనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మోహన్ బాబు వెల్లడించారు.
సినిమా ప్రారంభ దశలో కథా చర్చల సమయంలో తన పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ ఉంటుందని శ్రీకాంత్ ఓదెల చెప్పారని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ హీరోయిన్ పాత్ర అసలు లేదని దర్శకుడు చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు. ముందుగా హీరోయిన్ ఉంటుందని చెప్పి, ఆ తర్వాత పాత్ర లేదని చెప్పడం మోసం కాదా అంటూ మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!