

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. భక్తుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేవలం తెలుగు భక్తుల సమస్యగా కాకుండా, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యగా చూడాలని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలో ఏపీ నుంచి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సమస్యలపై సదస్సు నిర్వహించారు.
కేరళలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాను స్వయంగా అనుభవించానని భాను ప్రకాశ్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు చెప్పే సమస్యలను ప్రభుత్వం వింటోందే తప్ప, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!