

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ చరిత్రలో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానం కంటే పైకి రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఖాతాలో 78 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
126 పాయింట్లతో ఆస్ట్రేలియా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 106, భారత్ 104, ఇంగ్లండ్ 99 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఓటమి ఎదురైనప్పటికీ, ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ సాధించిన ఈ పురోగతి జట్టుకు కీలక మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!