
సినిమాలు

హైదరాబాద్‌లో నిర్వహించిన దర్శకుల దినోత్సవం 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ బాబు పాల్గొని తన గురువును స్మరించుకున్నారు. తనను సినీ రంగానికి పరిచయం చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి దాసరి గారేనని ఆయన భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయిన బాధ ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుల సంఘానికి తన వంతుగా 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. నటి జయసుధ మాట్లాడుతూ, దాసరి గారి పేరిట ఇచ్చే పురస్కారం ప్రపంచంలోని ఏ పురస్కారానికన్నా గొప్పదని అన్నారు. అనేక మంది నటీనటులను ప్రముఖులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందుతుందని చెప్పారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని దాసరితో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!