

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి’ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ తెరపై కనిపించకపోయినా, ‘బుజ్జి’ పాత్రకు తన గాత్రాన్ని అందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాత్ర వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ తొలుత మరో పాత్రను ఆఫర్ చేసినప్పటికీ అది తనను అంతగా ఆకట్టుకోకపోవడంతో తిరస్కరించినట్లు తెలిపారు. అయితే మరుసటి రోజే దర్శకుడు మళ్లీ ఫోన్ చేసి ‘బుజ్జి’ పాత్రకు కేవలం వాయిస్ ఇవ్వాలని కోరారని చెప్పారు. షూటింగ్కు రావాల్సిన అవసరం లేదని, కేవలం గాత్రం మాత్రమే కావాలని చెప్పడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగిందన్నారు. మొదటి ఆఫర్ను తిరస్కరించడం వల్లే ‘బుజ్జి’ వంటి గుర్తుండిపోయే పాత్ర తనకు దక్కిందని, అదే తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని కీర్తి సురేష్ వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!