
రాజకీయాలు

గచ్చిబౌలిలోని RM1 కోడర్స్ హబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థపై భారీ మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో సుమారు 250 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో వాసవి స్కై సిటీలో ప్రారంభమైన ఈ స్టార్టప్, ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు సమాచారం.
రాము, జయంత్ ఆధ్వర్యంలోని యాజమాన్యం ప్రాజెక్టులు వస్తున్నాయని, జీతాలు త్వరలో ఇస్తామని ఉద్యోగులను నమ్మించినప్పటికీ 2026 జనవరి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా కార్యాలయాన్ని మూసివేసి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!