

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. 2017లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీకి టాలీవుడ్‌తోనూ ఓ ఆసక్తికరమైన కుటుంబ సంబంధం ఉంది. నటి రుహానీ శర్మ, అనుష్క శర్మకు కజిన్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో రుహానీకి విరాట్ కోహ్లీ బావ వరుస అవుతారని ఆమె వివరించిన విషయం ప్రస్తుతం మరోసారి చర్చకు వచ్చింది.
రుహానీ శర్మ 2018లో ‘చి లా సౌ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘శ్రీరంగ నీతులు’ తదితర చిత్రాల్లో నటించారు. తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ ఆమె పనిచేశారు. ప్రస్తుతం రుహానీ శర్మకు సంబంధించిన కుటుంబ బంధం, ఆమె సినీ ప్రయాణం మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!