

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి ఊపందుకుంది. కొంతకాలం విరామం తర్వాత పలువురు స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాల చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, కోకాపేట, అన్నపూర్ణ స్టూడియోస్, అజీజ్ నగర్, అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్స్ కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమా చాలా నెలల తర్వాత ముంబై నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయింది. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ కోకాపేటలో, బాలకృష్ణ ‘దాదా’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ అజీజ్ నగర్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘కాకా’ సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. నితిన్, నాని కాంబినేషన్‌లోని ‘అలియాస్ రుక్మిణి’, శర్వానంద్ సినిమా, శ్రీ విష్ణు ప్రాజెక్ట్, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, గోపీచంద్ తదితర చిత్రాల షూటింగ్స్ కూడా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉండటంతో టాలీవుడ్‌లో చిత్రీకరణ సందడి మరింత పెరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!