

కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్.. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా కొనసాగుతున్నారు. తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె పీరియడ్స్ సమయంలో తాను ఎదుర్కొనే తీవ్రమైన నొప్పి, పీసీఓఎస్ కారణంగా కలిగే ఇబ్బందుల గురించి మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు తాను కొంత సంకోచించేదానినని, ఈ అంశంపై సమాజంలో పెద్దగా చర్చ ఉండేది కాదని ఆమె గుర్తుచేసుకున్నారు.
తోటి నటులు మోకాలి శస్త్రచికిత్స వంటి సమస్యల గురించి చెబితే షూటింగ్ షెడ్యూల్‌లో దర్శకులు అవసరమైన మార్పులు చేసేవారని, కానీ పీరియడ్స్ గురించి చెప్పేందుకు తాను ఇబ్బంది పడేదానినని శ్రుతి తెలిపారు. పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే మహిళలు ఎదుర్కొనే బాధ వారికి అర్థమయ్యేదని, అప్పుడు పని ప్రదేశాల్లో పీరియడ్ లీవ్ వంటి సదుపాయాలు కూడా సహజంగా వచ్చేవేమోనని ఆమె వ్యాఖ్యానించారు. ఒకసారి తాను పీరియడ్స్ గురించి ఓ దర్శకుడితో చెప్పగా, ఆయన తన పరిస్థితిని అర్థం చేసుకుని పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆ అనుభవం తర్వాత ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడే విషయంలో తన ఆలోచనా విధానం మారిందని శ్రుతి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!