
బిజినెస్

ప్రముఖ లగ్జరీ వాచ్‌ల తయారీ సంస్థ జాకబ్ అండ్ కో (Jacob & Co) రామాయణం స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేకమైన శ్రీ రామచంద్ర లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను పరిచయం చేసింది. ఈ వాచ్ డయల్‌పై అయోధ్య రామాలయం, శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిమలను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలను లగ్జరీ డిజైన్‌తో మేళవిస్తూ ఈ టైమ్‌పీస్‌ను తయారు చేశారు.
ఈ వాచ్ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ కేస్, బ్లూ డయల్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో తిరిగే భూగోళం, 48 గంటల పవర్ రిజర్వ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ వాచ్ ధరను ఏకంగా రూ.4.25 కోట్లుగా నిర్ణయించారు. వినూత్నమైన డిజైన్, విలాసవంతమైన రూపంతో ఈ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!