

స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ మరోసారి బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. వేవ్‌బ్యాండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు గత మూడేళ్లుగా జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. పోస్టర్‌ను బట్టి ఇందులో నిత్యా మీనన్ పాత్ర శక్తివంతంగా, ఊహించని కోణాలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోంది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తి వల్లే ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఉత్కంఠభరితమైన పాయింట్‌తో కథ సాగనుంది. రహస్యాలు, ఉత్కంఠ, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!