

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. ఈ సినిమాను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్‌తో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పిన అభిప్రాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆస్వాదించానని చిరంజీవి చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వం చాలా బాగా ఉందని, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ నటన అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఒక అన్నయ్యగా మాత్రమే కాకుండా, ఒక సినీ అభిమాని గా కూడా ఈ సినిమా తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఈ చిత్రంలోని రెండు పాటలను మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కెరీర్‌లో గుర్తుండిపోయే క్లాసిక్ పాట ‘వాన వాన వెల్లువాయే’ ను రీమిక్స్ చేసిన విధానం తనకు చాలా నచ్చిందని చెప్పారు. అలాగే ‘ఈ మనసే’ అనే మెలోడీ పాట మరియు దాని చిత్రీకరణ కూడా తనను ఆకట్టుకుందని అన్నారు. సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చిరంజీవి అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!