
సినిమాలు

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ హైప్ క్రియేట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న మెగా-158 సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరై ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ముహూర్తపు షాట్‌కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడికి స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు అందజేయగా, అనస్వర రాజన్ కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!