
బిజినెస్

నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్' చిత్రంలోని ‘ఆయా షేర్’ పాట కోసం చిత్రబృందం భారీ స్థాయిలో సెట్స్ నిర్మించింది. ఈ పాట చిత్రీకరణ కోసం సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో స్లమ్ గ్రామాన్ని పోలి ఉండేలా దాదాపు 60 ఇళ్లతో ప్రత్యేకంగా సెట్స్ నిర్మించారు. పాటకు అవసరమైన విజువల్స్ మరింత గ్రాండ్‌గా కనిపించేందుకు దాదాపు 100 వాటర్ ట్యాంకర్లను ఉపయోగించి పెద్ద నీటి వనరును కూడా సృష్టించారు.
ఇక ఈ పాటలోని విజువల్ గ్రాండియర్‌ను పెంచేందుకు ప్రత్యేకంగా నాని ఇంటి సెట్‌తో పాటు ఒక డంప్ యార్డ్‌ను కూడా నిర్మించారు. ఈ భారీ సెట్స్‌తో ‘ఆయా షేర్’ సాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం భావిస్తోంది. ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన వివరాలు సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!