

తన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడించారు. వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని, ఇది తమకు ఓ బిడ్డలాంటిదని అన్నారు. ట్రస్ట్‌కు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన, జూన్ 7న ప్రారంభం కానున్న ‘రక్షక్’ సినిమా లాంచ్ సందర్భంగా ‘ఐక్య’కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. మహిళా సమస్యలు, సాధికారత ప్రధానాంశాలుగా ‘రక్షక్’ రూపొందుతోందని, అందులో తాను డీసీపీ పాత్రలో కనిపిస్తానని చెప్పారు.
తన సినీ ప్రయాణంపై మాట్లాడిన మనోజ్, దర్శకులు విజయ్ కనకమేడల, కార్తిక్ ఘట్టమనేనిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు చేసిన ప్రతి కథను తానే విని, తనకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకున్నానని వెల్లడించారు. రాజకీయాలపై స్పందిస్తూ తాము పుట్టినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తన భార్య పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ‘డేవిడ్ రెడ్డి’, ‘మోహన రాగ మ్యూజిక్’ తదితర ప్రాజెక్టులపై అప్డేట్స్ ఇచ్చిన ఆయన, ‘వాట్ ది ఫిష్’ సినిమా వీసా సమస్యల కారణంగా వాయిదా పడిందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!