

బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న NBK111 చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ చేరికతో సినిమా మరింత శక్తివంతంగా మారనుందని మేకర్స్ పేర్కొన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మనోజ్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రతినాయకుడిగా నటిస్తారా లేదా మరో కోణంలో కనిపిస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో కలిసి నటించిన బాలకృష్ణ, మనోజ్ మరోసారి తెర పంచుకోనున్నారు.
మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రాల వివరాలు కూడా విడుదలయ్యాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వడ్డీ కాసులవాడ చిత్రాన్ని ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ఈసారి యాక్షన్‌తో కాకుండా వినోదంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మనోజ్ తెలిపాడు. ఇదే సమయంలో డేవిడ్ రెడ్డి టీజర్‌ను కూడా విడుదల చేశారు. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో సాగనుంది. రమ్య కృష్ణన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!