
రాజకీయాలు

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై హీరో మంచు మనోజ్ తక్షణమే స్పందించారు. శుక్రవారం రాత్రి ఇచ్చిన హామీ ప్రకారం, శనివారం ఉదయం 7 గంటలకే తన టీమ్‌తో కలిసి సమాధి వద్దకు చేరుకున్నారు. సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు సమయం కేటాయించి, సమాధి ప్రాంగణంలో ఉన్న ఎండుటాకులు, చెత్తాచెదారాన్ని స్వయంగా శుభ్రం చేశారు.
ఒక యాంకర్ షేర్ చేసిన వీడియోలో సమాధి నిర్లక్ష్యాన్ని చూసి తాను తీవ్రంగా చలించిపోయానని మనోజ్ తెలిపారు. ఇటీవల మంచు మనోజ్ మరియు మౌనిక భూమా మంచు ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేన సమితి’ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించారు. ఆయన చర్యకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!