

మహేష్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి 1.43:1 ఐమాక్స్ నిష్పత్తిలో విస్తృతంగా చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఆంగ్లేతర చిత్రాల్లో ఈ తరహా భారీ చిత్రీకరణకు ప్రాధాన్యం దక్కే అవకాశముంది. సాంకేతికంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో దర్శకుడు రాజమౌళి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా కథకు అనుగుణంగా పలు ఖండాల్లోని ప్రత్యేక ప్రాంతాలను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. ఆఫ్రికా, అంటార్కిటికా, యూరప్‌తో పాటు ప్రాచీన భారతదేశానికి సంబంధించిన నేపథ్యాలు కూడా సినిమాలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభిన్న ప్రాంతాలు, భారీ దృశ్యాలు, అత్యాధునిక చిత్రీకరణ పద్ధతులతో వారణాసిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రీకరణకు సంబంధించిన ఈ వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్పందన అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!