

బిగ్‌బాస్ తెలుగు 10 తొలి వారంలోనే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో హౌస్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ జరిగే విధానానికి భిన్నంగా ఈసారి హౌస్‌మేట్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ జరిగింది. చరణ్, రామ్ ప్రసాద్ హై రిస్క్‌లో ఉన్నారని బిగ్‌బాస్ ప్రకటించి, వీరిద్దరిలో ఎవరి ప్రయాణం ముగియాలనేది ఇంటి సభ్యులే నిర్ణయించాలని చెప్పారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో చరణ్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన ఎలిమినేట్ అయ్యారు.
హౌస్ నుంచి బయటకు వెళ్తూ చరణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఎలిమినేషన్ జరిగిన విధానం తనకు నచ్చలేదని, ఇంట్లో అనవసరంగా గ్రూపులు ఏర్పడకూడదని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అమన్, రోహిత్, సృష్టి, షాలినికి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలోనే వారితో మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. మరోవైపు, చరణ్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ అంశంపై స్పందిస్తారా? చరణ్‌కు మరో అవకాశం ఇస్తారా? అనే ఆసక్తి పెరుగుతోంది. అయితే చరణ్ రీఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!