

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు ఫాంటసీ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించగా, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, బాలనటి స్సారా పాలేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతున్న వేళ.. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రత్యేక స్క్రీనింగ్ వీక్షించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మహేశ్ బాబు ఈ చిత్రాన్ని అద్భుతమైన, సంపూర్ణమైన అనుభూతిగా అభివర్ణించారు. వినోదంతో పాటు లోతైన భావోద్వేగాలు, ఆత్మీయత ఈ సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఫహాద్ ఫాజిల్ నటనను ప్రశంసిస్తూ.. ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫహాద్, స్సారా కలిసి తెరపై అద్భుతంగా కనిపించారని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు శశాంక్ ఏలేటి పనితీరును, నిర్మాతగా ఎస్.ఎస్. కార్తికేయ కొత్త ప్రయాణాన్ని అభినందించారు. అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను థియేటర్లలో అనుభవించాలని మహేశ్ బాబు కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!