

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. కుటుంబ భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనం ప్రేక్షకులను మెప్పించడంతో థియేటర్లలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
ఈ విజయవంతమైన స్పందనతో ‘మా ఇంటి బంగారం’ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొస్తోంది. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!