
సినిమాలు

ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తొలుత తమిళ్ తాయ్ వాజ్తు గీతాన్ని ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం స్వాగతించదగినదని పేర్కొన్నారు.
మంగళవారం ఎక్స్ వేదికగా కమల్ హాసన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర హక్కులను వదులుకోని ఈ విధానం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!