

నాగార్జున జీవితంలో గత కొంతకాలంగా ఒక కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలు, ప్రయోగాలు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు, టూర్స్‌తో బిజీగా ఉండే ఆయన గతంలో తన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ప్రైవసీ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల తర్వాత తండ్రి ఆశయాలు, ఆయన వారసత్వానికి సంబంధించిన విషయాలపై నాగార్జున ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీకి విరాళం ఇవ్వడంతో పాటు, సంస్థకు తన నిరంతర మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సీనియర్ అక్కినేని అభిమానులను ఆహ్వానించి ఏఎన్నార్ సినిమాలను ప్రదర్శించడం ద్వారా వారితో మరింత అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
మరోవైపు కుమారులు నాగచైతన్య, అఖిల్ కెరీర్‌ల విషయంలోనూ నాగార్జున మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. అఖిల్ లెనిన్ కోసం సమయం కేటాయించడంతో పాటు, అభిమానులతో సంబంధించిన కొన్ని ఫాలోఅప్ బాధ్యతలను క్రమంగా నాగచైతన్యకు అప్పగించినట్లు కనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని, ఏఎన్నార్ అప్పట్లో ఏర్పాటుచేసిన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నారు. పళ్లబురుసు ప్రమోషన్స్‌లోనూ తల్లిదండ్రుల గురించి భావోద్వేగంగా మాట్లాడిన నాగార్జున, తల్లిదండ్రులను చూసుకోవడం బాధ్యత మాత్రమే కాక అదృష్టమని పేర్కొన్నారు. ఈ మార్పుకు కారణాలు ఏవైనా, గత ఏడాది కాలంలో నాగార్జున తన సినిమాల కంటే కుటుంబం, తండ్రి వారసత్వం, కుమారుల విజయంపై ఎక్కువ సమయం కేటాయిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అభిమానుల కోరిక ఒక్కటే.. King100తో మరోసారి వింటేజ్ నాగ్‌ను చూడాలని.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!