

పంజాబ్‌లోని పాటియాలాలో పెంపుడు పిట్‌బుల్ దాడిలో ఓ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనతో రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి ఆస్తిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఇంటికి చేరుకున్న దంపతులు డోర్‌బెల్ మోగించగా.. ఆ ప్రాంగణంలో ఉన్న పిట్‌బుల్ ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. కుక్క దాడిలో భార్యాభర్తలిద్దరికీ పలుచోట్ల కాటు గాయాలు అయినట్లు సమాచారం. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్క నుంచి వారిని రక్షించారు.
అనంతరం గాయపడిన దంపతులను పాటియాలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పెంపుడు జంతువుల విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!