

మహేష్ బాబు మరియు రాజమౌళి కొత్త సినిమా “వారణాసి” టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అద్భుతంగా జరిగింది. ఈ ఈవెంట్ మొదలయ్యే ముందు టైటిల్ వీడియో బయటకు లీక్ కావడంతో రాజమౌళి కొంచెం బాధపడ్డారు. టెస్ట్ షూట్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ వచ్చి దృశ్యాలు తీసుకెళ్లిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ :
“వారణాసి 2027 వేసవిలో రిలీజ్ అవుతుంది” అని ప్రకటించారు. ఈ సినిమా కోసం తాను అన్ని రకాల సంగీతంతో అభిమానులను ఆకట్టుకుంటానని చెప్పారు.
సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ కూడా స్టేజ్‌పై మాట్లాడుతూ :
“మహేష్ - రాజమౌళి సినిమా 15 ఏళ్ల క్రితమే చేయాలనుకున్నాం, ఇప్పుడు అది నిజమైంది” అని చెప్పారు.
ఈవెంట్లో కీరవాణి బృందం పృథ్వీరాజ్ పాత్ర కోసం ఒక పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించగా అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు.
రామోజీ ఫిలింసిటీలో ‘వారణాసి’ సెట్ చాలా భారీగా నిర్మించారని కూడా అక్కడ వినిపించిన టాక్.

.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!