

తన విభిన్నమైన నటనతో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో కవిన్ అభిమానులతో ఓ శుభవార్తను పంచుకున్నారు. ఆయన భార్య మోనిక కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు కవిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2023 ఆగస్టులో తన చిరకాల స్నేహితురాలు మోనికను వివాహం చేసుకున్న కవిన్, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుతూ వచ్చారు.
తండ్రిగా మారిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కవిన్ భావోద్వేగ పోస్ట్ చేశారు. తమ జీవితాల్లోకి ఒక బాబు, ఒక పాప వచ్చి రెట్టింపు ఆనందాన్ని తీసుకొచ్చారని తెలిపారు. మరోవైపు సినిమాల విషయానికి వస్తే, కవిన్ ప్రస్తుతం నయనతారతో కలిసి ‘హాయ్’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తండ్రిగా కొత్త ప్రయాణం ప్రారంభించడంతో పాటు, క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమవుతుండటంతో కవిన్ ఆనందంలో ఉన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!