
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యువతలో భారీ క్రేజ్ సంపాదించిన టీమ్ ఇప్పుడు ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘కన్యారాశి’ గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కొత్త భాగంతో మరోసారి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!