

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో సీక్వెల్ ‘కల్కి 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల ఈ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ 2026 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. షూటింగ్ మొదలైన తర్వాత 2027 మధ్య నాటికి ప్రధాన చిత్రీకరణను పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ షెడ్యూల్‌ను అమలు చేయడం అంత సులభం కాదనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో ఉండగా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం ఆయన ‘కల్కి 2’ సెట్స్‌లోకి వెళ్లనున్నారు. మరోవైపు కీలక నటీనటుల తేదీలను కూడా సమన్వయం చేయాల్సి ఉంటుంది. భారీ విజువల్స్, విస్తృత నిర్మాణం ఉన్న సినిమా కావడంతో షూటింగ్ షెడ్యూల్‌ను పక్కాగా అమలు చేయడం కీలకంగా మారనుంది. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ తర్వాత ‘కల్కి 2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!