
రాజకీయాలు

నటి జాన్వీ కపూర్ తన మద్యం అలవాటుపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుడు విధంగా ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరించి ప్రచారం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
అమహా నిర్వహించిన ఆఫ్ ది రాక్స్ పాడ్‌కాస్ట్‌లో జాన్వీ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల తర్వాత మద్యం అలవాటు ఏర్పడిందని, దానినుంచి బయటపడేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. అయితే, ఆ వ్యాఖ్యలను కొన్ని కథనాలు తప్పుగా చూపించాయని ఆమె టీమ్‌తో పాటు నిర్వాహకులు స్పష్టం చేశారు. నిజాలను ధృవీకరించకుండా ప్రచారం చేయవద్దని జాన్వీ తన సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!