
జనరల్

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటుతూ భారీ రికార్డు సృష్టించింది. రవి నంబూరి దర్శకత్వంలో, సాయి రాజేష్ కథ, కథనంతో తెరకెక్కిన ఈ కల్ట్ లవ్ స్టోరీ, భారీ పోటీ మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను అందుకుంది. ఈ విజయంతో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో మంచి బుకింగ్స్ నమోదవుతుండగా, వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించగా, ఈ సీజన్‌లో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా చెన్నై లవ్ స్టోరీ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!